టాలీవుడ్ నుండి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతుందన్నమాట. అందరూ ఊహించినట్టే.. దిల్‌రాజ్.. అమిర్‌ఖాన్ కాంబో బొమ్మ తీయబోతున్నారా..? మిస్టర్ పర్‌ఫెక్ట్ అమిర్‌ఖాన్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడా..? ఇప్పుడిదే గాసిప్.. టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారింది. అసలు ఈ ప్రాజెక్ట్ ప్రచారంలో నిజమెంత.. ఒకవేళ నిజమైతే బడ్జెట్ ఎంత.. అమిర్‌ఖాన్‌ను డైరెక్ట్ చేసెదెవరు.. పక్కన స్టెప్పులేసేదెవరంటూ.. ఇలా ఎన్నో క్రేజీ గాసిప్స్ టాలీవుడ్ వీధుల్లో రీసౌండ్ చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక ఆయన గత నెలలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమిర్‌ఖాన్‌ను మీట్ అయ్యారు. ఇక అప్పటి నుండి వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది అంటూ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. దిల్‌రాజ్ కూడా పాన్ ఇండియా మూవీగా మలిచేందుకు 300 కోట్ల రూపాయల బడ్జెట్‌ను సిద్ధంగా ఉంచారట. మొత్తానికి టాలీవుడ్ నుండి మరో భారీ బడ్జెట్ సినిమా పాన్ ఇండియాగా రాబోతుందన్నమాట.
కోలీవుడ్‌లో సినిమాలు తీసిన దిల్‌రాజ్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాడు. కానీ ఈసారి తెలుగు డైరెక్టర్.. హిందీ హీరో కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్‌ను డీల్ చేస్తున్నాడు దిల్ రాజ్.