ధనుష్‌ కొత్త సినిమా D56 థీమ్‌ పోస్టర్‌ వైరల్

ధనుష్‌ కొత్త సినిమా D56 థీమ్‌ పోస్టర్‌ వైరల్

కోలీవుడ్ హీరో ధనుష్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో నటిస్తోన్న కుబేర జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ ఏడాది కుబేరతోపాటు ఇడ్లీ కడై, తేరే ఇష్క్‌ మే సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ధనుష్ పాపులర్ ఫిల్మ్‌ మేకర్ మారి సెల్వరాజ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. థనుష్‌ తన కొత్త ప్రాజెక్ట్‌ డీ 56 (వర్కింగ్ టైటిల్‌)ను ప్రకటించేశాడు. మూలాలు ఒక గొప్ప యుద్ధాన్ని ప్రారంభిస్తాయి.. అంటూ క్యాప్షన్ ఇచ్చి హిస్టారికల్ యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా ఉండబోతున్నట్టు థీమ్‌ పోస్టర్‌ ద్వారా చెప్పాడు ధనుష్‌. థీమ్‌ పోస్టర్‌లో ఖడ్గం, పుర్రెను చూడొచ్చు. ధనుష్‌-మారి సెల్వరాజ్‌ కాంబోలో వచ్చిన రూరల్‌ యాక్షన్‌ డ్రామా కర్ణన్‌ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.

editor

Related Articles