ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సత్తా చాటింది. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత రేణూ తన పిల్లలని చూసుకుంటూ కాలం గడుపుతోంది. ఈ మధ్య టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో సైలెంట్ అయింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది. పవన్ నుండి విడిపోయాక రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తాజాగా తన రిలేషన్ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో నేను అరేంజ్‌డ్ నిశ్చితార్థం చేసుకోవాలి, వేరే రిలేషన్ షిప్‌లోకి వెళ్లాలి అని అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకుంటే పిల్లలకి సరైన న్యాయం చేయలేనేమో అని ఆగాను. ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్నారు. నేను వేరే జీవితం మొదలు పెడితే వారికి పూర్తి సమయం కేటాయించలేను. అందుకే వేరే రిలేషన్‌లోకి వెళ్లలేదు.

- April 10, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor