రేపే రిలీజ్-ప్ర‌దీప్‌ హీరోగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

రేపే రిలీజ్-ప్ర‌దీప్‌ హీరోగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

హీరో రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ అందిపుచ్చుకున్నారు. ఆయ‌న ఎంత ఎదిగినా ఒదిగే ఉంటార‌నే విష‌యం  తెలిసిందే. ప్ర‌స్తుతం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది  సినిమా చేస్తున్న రామ్ చ‌ర‌ణ్.. యాంక‌ర్ ప్ర‌దీప్‌కి త‌న వంతు సాయం చేశారు. ప్రదీప్ – దీపికా పిల్లి జంటగా తెరకెక్కిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఏప్రిల్ 11 న రిలీజ్ కాబోతోంది. గ‌త కొద్ది రోజులుగా సినిమా యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతో మంచి హిట్ కొట్టిన ప్ర‌దీప్ ఇప్పుడు రెండో సినిమాతో కూడా అలరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. సినిమా ప్రమోష‌న్‌లో భాగంగా రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా ఫ‌స్ట్ టికెట్ కొన్నారు. అయితే రామ్ చ‌రణ్‌ని క‌లిసేందుకు ప్రదీప్‌తో పాటు కమెడియన్ సత్య ఇద్దరూ చరణ్ ఇంటికి వెళ్లారు.

editor

Related Articles