కొవిడ్ సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం వద్ద నుండి డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని సోనుసూద్ తెలిపారు. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతోమందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్ చేశారు. ఈ క్రమంలో సోనుసూద్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారంపై సోనుసూద్ తాజాగా స్పందించారు. మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనుసూద్ మాట్లాడుతూ.. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశారు. అయితే, ఆ ఆఫర్లను నేను తిరస్కరించాను. స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా’ అని ఈ రియల్ హీరో తెలిపారు.

- December 26, 2024
0
12
Less than a minute
Tags:
You can share this post!
editor