బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్యా బెదిరింపులు..

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్యా బెదిరింపులు..

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు, హత్యలు చేస్తామని బ్లేక్‌మెయిల్ సందేశాలు, వారిమెదళ్లను ఆందోళనలో పడవేస్తున్నాయి. తాజాగా పలువురు సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుండి ఇదివలరో సల్మాన్‌కు బెదిరింపులు, ఇక మొన్నటికి మొన్న బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇంతలోనే పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ కపిల్‌ శర్మతోపాటు రాజ్‌పాల్‌ యాదవ్‌, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాకు హత్యా బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బిష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. మీరు ఈ సందేశాన్ని సీరియస్‌గా తీసుకోండి’ అంటూ ఈ-మెయిల్లో పేర్కొన్నట్టు పలు మీడియా సంస్థలు రిపోర్టు చేస్తున్నాయి.

editor

Related Articles