వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సంక్రాంతి పండుగకు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ సినిమాకు బాబి కొల్లి దర్శకత్వం వహించగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా గురువారం అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా 40 మందికి పైగా గాయపడ్డారు.
- January 9, 2025
0
98
Less than a minute
Tags:
You can share this post!
editor


