విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎందుకంత స్పెషల్ అనేది మరోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో రుజువైంది. ఈ సినిమాకు వరల్డ్‌వైడ్‌గా వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా ఎలాంటి సెన్సేషనల్ రన్‌ను సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూకుడుగా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ కలెక్షన్స్ సంఖ్య మరింతగా పెరగడం ఖాయమని సినిమా యూనిట్ ఆశిస్తోంది. ఇక ఈ సినిమాలో వెంకీ పర్ఫార్మెన్స్‌తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

- January 18, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor