యష్ – కియారా కెమిస్ట్రీ అదుర్స్

యష్ – కియారా కెమిస్ట్రీ అదుర్స్

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్- ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి వీడియో సాంగ్ ‘తబాహి’ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో యష్, కియారా అద్వానీ మధ్య కనిపించిన రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. స్టైలిష్ విజువల్స్, గ్రాండ్ మేకింగ్, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ప్రేమ, ఎమోషన్, ఇంటెన్సిటీని చూపిస్తూ రూపొందించిన ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పాట సంగీతపరంగా సాధారణ స్పందన పొందుతున్నప్పటికీ, విజువల్స్‌కు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ఈ సినిమాకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బస్రూర్, తనిష్క్ బాగ్చీ, ఫహీమ్ అబ్దుల్లా తదితరులు సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె. నారాయణతో కలిసి యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles