‘NBK111’ క్రిస్మస్ రిలీజ్?

‘NBK111’ క్రిస్మస్ రిలీజ్?

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ సినిమాలో బాలయ్యను స్టైలిష్ మాస్ లుక్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలుత డిసెంబర్ తొలి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ, ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ డిసెంబర్ 3న విడుదల కానుండటంతో, బాక్సాఫీస్ పోటీని నివారించేలా విడుదల తేదీని మార్చినట్లు టాక్ వినిపిస్తోంది.

క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులు కలిసి రావడం వల్ల సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్, బాలయ్య మాస్ ఎలివేషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Related Articles