‘జైలర్ 2’కు రికార్డు డిమాండ్

‘జైలర్ 2’కు రికార్డు డిమాండ్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌కు విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

తాజా సమాచారం ప్రకారం, సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మలయాళ థియేట్రికల్ హక్కుల కోసం ఇప్పటికే పోటీ మొదలైంది. కేరళకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఈ సినిమా హక్కులను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తొలి భాగం కేరళలో భారీ వసూళ్లు సాధించడంతో పాటు, మోహన్‌లాల్ ప్రత్యేక పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

దీంతో ‘జైలర్ 2’లో కూడా మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రజినీకాంత్, మోహన్‌లాల్‌ల క్రేజ్ కలిసి ఈ సినిమాకు మలయాళ మార్కెట్‌లో మరింత బలం చేకూరుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణాది మార్కెట్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ ‘జైలర్ 2’ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే హక్కుల విక్రయానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ ఇంకా వెల్లడించలేదు.

Related Articles