చిరు ‘మెగా 158’లో మాస్ ట్రీట్

చిరు ‘మెగా 158’లో మాస్ ట్రీట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అలాగే ‘డాకు మహారాజ్’ తర్వాత బాబీ రూపొందిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల పొల్లాచ్చిలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రబృందం ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారని, ఇది అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ ఫైట్‌ను అత్యంత గ్రాండ్‌గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాకి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీపై చిత్రబృందం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Related Articles