బబుల్ గమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు సిద్దు జొన్నల గడ్డ సోదరుడు చైతు సిద్దు జొన్నల గడ్డ. చైతూ రైటర్‌గా ధార్కారి మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్ 2ను ప్రకటించగా.. ఇప్పటికే డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. పాన్ మసాలా సినిమా అని ప్రీ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్నాడు. చైతూ జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా టైటిల్ లుక్‌ను న్యాచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. ఈ చిత్రానికి మోసెస్ మాణిక్‌చంద్‌ను (పార్టు 2) టైటిల్ ఖరారు చేశారు. రియల్ విలన్ ఫేక్ హీరో కంటే బెటర్. టౌన్‌లో కొత్త డాన్ మోసెస్ మాణిక్‌చంద్‌ను మీట్ అవ్వండి.. అంటూ సోఫాలో కూర్చున్న చైతూ మెడ నిండా బంగారు ఆభరణాలు, స్టైలిష్ గాగుల్స్ పెట్టుకొని కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ చిత్రానికి చైతూ జొన్నలగడ్డ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. చైతూ జొన్నలగడ్డ నాని నటిస్తోన్న హిట్ 3లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి చైతూ ఓ వైపు యాక్టర్‌గా, మరోవైపు రైటర్‌గా తనను తాను నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నాడని అర్థమవుతోంది.

- November 15, 2024
0
29
Less than a minute
Tags:
You can share this post!
administrator