డాకు మహరాజ్‌గా బాలకృష్ణ..

డాకు మహరాజ్‌గా బాలకృష్ణ..

బాలకృష్ణ  కాంపౌండ్ నుండి వస్తోన్న తాజా చిత్రం ఎన్‌బీకే 109. బాబీ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తున్న  ఈ సినిమాకి డాకు మహరాజ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్‌బీకే 109 టైటిల్‌ అనౌన్స్‌మెంట్ టీజర్‌ రానే వచ్చేసింది. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహరాజ్‌ది.. డాకు డాకు మహరాజ్‌ అంటూ సాగుతున్న టీజర్‌ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది.

administrator

Related Articles