సాహసగాథలో శ్రీరాముడిగా మహేష్

సాహసగాథలో శ్రీరాముడిగా మహేష్

మహేష్ తన రెండో సినిమా ‘యువరాజు’లోని ఓ పాటలో కృష్ణుడిగా కనిపించి అభిమానుల్ని ఉత్సాహపరిచారు. ఆ తర్వాత మళ్లీ ఆయన పౌరాణిక గెటప్పులో అసలు కనిపించ లేదు. అయితే.. త్వరలోనే శ్రీరాముడిగా మహేష్ దర్శనమివ్వబోతున్నాడట. రాజమౌళి సినిమాలో మహేష్ ఈ ఫీట్‌ చేయబోతున్నట్టు సోషల్‌ మీడియాలో కథనాలు బలంగానే వినిపిస్తున్నాయి. వారణాసిలో పుట్టి అమెజాన్‌ అడవుల్లో కొనసాగే ఈ కథలో రామాయణకావ్యం కీలకంగా ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఓ సన్నివేశంలో శ్రీరాముడిగా మహేష్ కనిస్తాడని తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా క్లెమాక్స్‌లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ని చూపించి ప్రేక్షకుల్ని రోమాంచితుల్ని చేశారు రాజమౌళి. ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తే నిజమై రామచంద్రమూర్తిగా మహేష్ దర్శనమిస్తే.. ఆ ఇంపాక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి మించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

administrator

Related Articles