ప్ర‌ముఖ తెలుగు నటీన‌టుల‌పై కేసు న‌మోదు

ప్ర‌ముఖ తెలుగు నటీన‌టుల‌పై కేసు న‌మోదు

బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ కేసులో కీల‌క పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేస్తున్న ప్ర‌ముఖ నటీన‌టుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ‌ర్ల‌తో స‌హా దాదాపు 25 మందిపై సైబారాబాద్‌కి చెందిన మియాపూర్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసి యువ‌త‌ను చెడగొడుతున్నారని మియాపూర్‌కి చెందిన ప్రమోద్ శర్మ అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ప్ర‌మోష‌న్ల‌ను అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును స్వీక‌రించిన మియాపూర్ పోలీసులు.. బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టులు రానా ద‌గ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్ర‌కాష్‌రాజ్, ప్ర‌ణీత‌, శ్రీముఖి, రీతూ చౌద‌రి, యాంక‌ర్ శ్యామ‌ల‌, అనన్య నాగళ్ల త‌దిత‌రులపై కేసు న‌మోదు చేశారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లలో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభాషెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతల పేర్లు ఉన్నాయి.

editor

Related Articles