కొత్త స్క్రిప్ట్‌తో వచ్చా.. కమల్ హాసన్ కామెంట్స్‌..

కొత్త స్క్రిప్ట్‌తో వచ్చా.. కమల్ హాసన్ కామెంట్స్‌..

ఉలగనాయగన్ కమల్ హాసన్‌  ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్నారన్న వార్త తెలిసిందే. వీటిలో ఒకటి థగ్‌ లైఫ్‌. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కమల్ హాసన్‌ను ఓ రిపోర్టర్‌ మీ నెక్స్ట్‌ సినిమా విక్రమ్‌ 2 గురించి చెప్పాలని అడిగాడు. అయితే విక్రమ్‌ 2పై కామెంట్‌ చేయకుండా.. నేను మరొక స్క్రిప్ట్‌ సిద్ధం చేశానన్నారు కమల్ హాసన్‌. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి కూడా వెళ్తుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి కమల్ హాసన్ ఎలాంటి కథ రెడీ చేశారు.. ఇంతకీ ఈ సినిమాలో స్వయంగా నటిస్తూ.. కమల్ హాసనే డైరెక్ట్ చేస్తాడా..? వేరే వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తాడా..? అనేది మాత్రం సస్పెన్స్‌గా నెలకొంది. థగ్‌లైఫ్‌ సినిమాలో కోలీవుడ్‌ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్‌ కార్తీక్‌, జోజు జార్జ్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఎఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌. కమల్ హాసన్‌ – ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం సినిమాలు, మద్రాస్ టాకీస్‌ బ్యానర్లపై కమల్‌ హాసన్‌ – ఆర్ మహేంద్రన్‌లు కలిసి తీస్తున్నారు.

editor

Related Articles