‘పుష్ప’ ఫ్రాంచైజీతో అందనంత స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నిజానికి ‘పుష్ప-2’ తర్వాత ఆయన త్రివిక్రమ్‌తో సినిమా చేయాలి. కానీ ఆ ప్లేస్‌లో అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. నిర్మాత నాగవంశీ మాటల్లో దానికి గల కారణం తేటతెల్లమైంది. ‘బన్నీ, త్రివిక్రమ్ కలయికలో మేం చేయబోయే సినిమా దేశం గర్వించేలా ఉంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇది. మైథాలజీ సబ్జెక్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. అయితే.. ఇది రామాయణ, మహాభారతాలకు సంబంధించిన కథ కాదు. ఇది మన ఇతిహాసాల్లో ఎవరికీ తెలియని కొత్త కథ. ఎవ్వరూ చూడని కొత్త పాత్రలో ఇందులో అల్లు అర్జున్ కనిపిస్తారు.
- March 26, 2025
0
135
Less than a minute
Tags:
You can share this post!
administrator


