‘జన నాయగన్’ లీక్‌పై విజయ్ దేవరకొండ ఫైర్..!

‘జన నాయగన్’ లీక్‌పై విజయ్ దేవరకొండ ఫైర్..!

‘జన నాయగన్’ సినిమా లీక్ ఘటన టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై హీరో విజయ్ దేవరకొండ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, సినిమా రిలీజ్‌కు ముందే లీక్ కావడం చాలా బాధాకరమని తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి ఘటన ఎదురైందని, ఆ సమయంలో ఎవరో కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపించి, తీవ్ర నిరాశకు గురయ్యానని చెప్పారు. సినిమా అనేది ఒక్క హీరోది కాదు, దర్శకుడు, నిర్మాత, నటీనటులు మరియు టెక్నీషియన్స్ అందరి కలల సమాహారమని ఆయన పేర్కొన్నారు. ఈ లీక్ వెనుక ఉన్న వారిని త్వరగా గుర్తించాలని, ఇలాంటి చర్యలు సినిమాకే కాదు పరిశ్రమ మొత్తానికి నష్టం కలిగిస్తాయని అన్నారు. ‘జన నాయగన్’ టీమ్‌కు తన పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles