టాలీవుడ్‌లో తనకు కాంపిటీషన్ ఎవరు అనే దానిపై దిమ్మదిరిగే సమాధానమిచ్చాడు స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 05 వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు బన్నీ. తాజాగా బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4కి కూడా ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే ఈ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు అల్లు అర్జున్. టాక్ షోలో భాగంగా.. బాలయ్య అడుగుతూ.. టాలీవుడ్‌లో నీకు బిగ్గెస్ట్ కాంపిటీషన్ ఎవరు. ప్రభాస్ లేదా మహేష్ అంటూ బన్నీని అడుగుతాడు. దీనికి బన్నీ నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడు ఉన్నాడు చూడు. ఎవడు అంటే అది రేపటి నేనే అంటూ పుష్ప సినిమాలోని పాటను పాడాడు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్‌కి అల్లు అర్జునే పోటీ అంటూ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

- November 15, 2024
0
33
Less than a minute
Tags:
You can share this post!
administrator