నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్‌లు కథానాయికలుగా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని పాటలను వరుసగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో మొదటి పాట ప్రొమోను విడుదల చేశారు. “డేగ డేగ డేగ.. దేకో దేకో బేగా.. గుర్రం పైన సింహం చేసే..” అంటూ ఈ పాట సాగుతోంది.
అనంత్ శ్రీరామ్ ఈ పాటను రాయగా నకాశ్ అజీజ్ పాడారు. తమన్ సంగీతాన్ని అందించారు. ఇక పూర్తి పాటను (రేపు) శనివారం విడుదల చేయనున్నారు.