బాలకృష్ణ డాకు మహారాజ్‌ షూటింగ్ పూర్తి..

బాలకృష్ణ డాకు మహారాజ్‌ షూటింగ్ పూర్తి..

బాలకృష్ణ  కాంపౌండ్ నుండి వస్తోన్న సినిమా డాకు మహారాజ్‌. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. కాగా విడుదలకు కొన్ని రోజులే మిగిలి ఉండటంతో ఇక బాబీ టీం ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది. ఎన్‌బీకే 109 గా వస్తోన్న ఈ సినిమాకి బాబీ  దర్శకత్వం వహిస్తున్నాడు. డాకు మహారాజ్‌ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మరోసారి టీజర్‌ను ట్యాగ్‌ చేస్తూ వీడియో విడుదల చేశారు. బాలకృష్ణను ఈసారి కంప్లీట్ కొత్త లుక్‌లో చూపించబోతున్నాడని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌లో.. ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు.. చీకటిని పంచే రాక్షసులది కాదు.. ఆ రాక్షసులనే ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది.. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది.. నన్ను గుర్తు పట్టావా..? డాకు డాకు మహారాజ్ అంటూ బాలకృష్ణ స్టైల్‌ ఆఫ్‌ డైలాగ్స్‌తో గూస్‌ బంప్స్‌ తెప్పిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు.

editor

Related Articles