మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న సినిమా ఛావా. తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర మంత్రి వార్నింగ్ ఇచ్చారు. భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన విలక్షణమైన నటనతో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు నితిన్. గతేడాది సామ్ మానేక్‌షా బయోపిక్‌తో వచ్చి హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టుడు విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా సినిమా ఛావా. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

- January 27, 2025
0
29
Less than a minute
Tags:
You can share this post!
editor