ఆర్కాడీ ఊహాత్మక ప్రపంచంలో సాగే సినిమా..

ఆర్కాడీ ఊహాత్మక ప్రపంచంలో సాగే సినిమా..

సాయిదుర్గతేజ్‌ ప్రస్తుతం యాక్షన్‌ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ప్రైమ్‌షో పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ వెలువడింది. ఈ నెల 12న టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఆర్కాడీ అనే ఊహాత్మక ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్‌ డ్రామాలో సాయిదుర్గతేజ్‌ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని, పీడితులను రక్షించే ధీరోదాత్తుడిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఐశ్వర్యలక్ష్మీ, జగపతిబాబు, శ్రీకాంత్‌, సాయికుమార్‌, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

editor

Related Articles