బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కి, నిర్మాత రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీకి షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్, నిర్మాత జాకీ భగ్నానీలు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మేరే హస్బెండ్‌కి బీవీ’. ఈ సినిమాను రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. షూటింగ్‌లో సెట్ పైకప్పు కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీకి గాయలు అయినట్లు సమాచారం. ఈ ఘటన జరిగి రెండు రోజులు అయ్యిందని.. అదృష్టవశాత్తూ, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని తెలిపాడు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు తివారీ తెలిపారు.

- January 20, 2025
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor