‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత ఏడాదిగా వెండి తెరకు దూరంగా ఉన్న అనుష్క త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె తొలి మలయాళ చిత్రం ‘కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్’ చిత్రీకరణ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. కథనార్ 14 భాషల్లో రిలీజ్ కానుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది ఈ సినిమా. తెలుగులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో అనుష్క నటించారు. హారర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా తీసిన ఈ సినిమా రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. డైరెక్టర్ రోజిన్ థామస్ ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా విభజించి తీస్తున్నారు.

- October 18, 2024
0
58
Less than a minute
Tags:
You can share this post!
administrator