మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ హీరోయిన్ ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇటీవల పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్న ఈ హీరోయిన్ ఐటెం సాంగ్స్ చేస్తూ అదరగొడుతోంది. అయితే తమన్నా కొద్దిరోజులుగా విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉంది. కాని ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పినట్టు సమాచారం. విజయ్ వర్మతో డేటింగ్ వరకు ఓకే, పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్పడంతో అతనితో తమన్నా బ్రేకప్ చేసుకుందని వార్తలు వినిపించాయి. అయితే తమన్నా ఇప్పుడు ఓదెల-2 సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇందులో శివశక్తి రోల్‌లో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. ‘తమన్నా.. మీరు పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు?’ అని ఇంటర్వ్యూలో అడగ్గా.. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పుకొచ్చింది. తమన్నా సమాధానం విని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల వేర్వేరుగా ఈ ఇద్దరు ఫంక్షన్స్‌కి , పార్టీలకి హాజరవుతున్నారు. దీంతో వారిద్దరు విడిపోయారని భావిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు సైతం ఇద్దరికీ బ్రేకప్ అయ్యిందనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఓదెల-2 సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- April 14, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor