‘పుష్ప2’తో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసాడు అల్లు అర్జున్. దాంతో ఆయన చేయబోయే సినిమా ఇప్పుడు ఎలా ఉంటుందో అని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగానే వినిపించింది. ఈ వేసవిలో కొబ్బరికాయ కొట్టినా.. షూటింగ్ మాత్రం ఆలస్యం కానుందని తెలుస్తోంది. అందుకే.. ఈలోపు అట్లీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట బన్నీ. ఇది ఎప్పట్నుంచో అనుకుంటున్న కాంబినేషన్. కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతమైతే ఈ కాంబో దాదాపు ఫిక్సయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని బలంగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్ ఫిక్స్ అయ్యిందట.
- February 17, 2025
0
124
Less than a minute
Tags:
You can share this post!
administrator


