ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ది రాజాసాబ్” కూడా ఒకటి. మరి చాలా కాలం తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న హర్రర్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది కావడంతో మళ్ళీ పాత ప్రభాస్‌ని చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని నిర్మాతలు ఈ ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కానీ ఇది వాయిదా పడింది. ఇక కొత్త రిలీజ్ డేట్ ఏంటి ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కానీ, ఈ కొత్త రిలీజ్ డేట్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో ఇపుడే తెలిసింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ఉగాది కానుకగా నిర్మాతలు కొత్త రిలీజ్ డేట్ ఏంటి అనేది రివీల్ చేస్తారని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

- February 25, 2025
0
31
Less than a minute
Tags:
You can share this post!
editor