గ్లామరస్‌గా కనిపిస్తూ అదే తరహా రోల్స్‌తోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారే హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది అలియాభట్. కాగా ప్రొఫెషనల్‌గా బిజీగా ఉండే ఈ బ్యూటీ షూటింగ్ పనుల నుండి బ్రేక్ తీసుకుంది. గతేడాది జిగ్రా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అలియా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం వెకేషన్ టూర్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలియా ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..? ప్రపంచ ప్రఖ్యాత టూరిజం స్పాట్స్‌లో ఒకటైన థాయ్‌లాండ్. బికినీలో థాయ్‌లాండ్ దీవుల్లోని సముద్రంలో జలకాలాడింది. సాగరతీరంలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించింది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్‌గా బోటు రైడ్ చేసింది. ఉదయాన్నే జిమ్ సెషన్‌కు వెళ్లింది. ఆ తర్వాత తనకిష్టమైన పుస్తకం చదివింది. అలియాభట్ థాయ్‌లాండ్ వెకేషన్లో సూపర్ ఛిల్ ఔట్ మూడ్‌లో ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. అలియాభట్ ప్రస్తుతం అల్ఫా, లవ్ అండ్ వార్ సినిమాల్లో నటిస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉన్నాయి.
- January 10, 2025
0
114
Less than a minute
Tags:
You can share this post!
administrator


