‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ద్వారా దర్శకులుగా పరిచయమవుతున్నారు దర్శకద్వయం నితిన్ – భరత్. యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం దర్శకులిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. తాము బుల్లితెరపై డిఫరెంట్ షోస్ చేశామని, అప్పటి నుండే ప్రదీప్‌తో పరిచయం ఉందని చెప్పారు. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని, గ్రామీణ నేపథ్యంలో చక్కటి హాస్యంతో మెప్పిస్తుందని అన్నారు. ఈ సినిమాలో కామెడీ చాలా సహజంగా ఉంటుందని, బ్రహ్మానందం.. సత్య పాత్రలు కడుపుబ్బ నవ్విస్తాయని తెలిపారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ఈ సినిమా బాగా నచ్చిందని, వేసవిలో రిలీజ్ చేస్తే బాగుంటుందని వారే సలహా ఇచ్చారని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్ సినిమా ఇదని చెప్పారు. రథన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రధానాకర్షణగా నిలుస్తాడని తెలిపారు.

- April 3, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor