AK 64 | తమిళ హీరో అజిత్ మరో స్టార్ దర్శకుడితో చేతులు కలపబోతున్నాడు. జిగరతండా, జిగరతండా డబుల్ ఎక్స్, పెట్టా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజ్ అజిత్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో అజిత్ ప్రస్తుతం ఫుల్ జోష్‌తో ఉన్నాడు. ఒకవైపు ఆయన నటించిన పట్టుదల (విడాముయర్చి) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్‌లో సందడి చేస్తుండగా.. మరోవైపు దుబాయ్‌లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ టీం మూడో స్థానంలో నిలిచింది. అయితే అజిత్ ప్రస్తుతం ప్యూచర్‌లో జరుగబోతున్న రేసింగ్ పోటీలకోసం సిద్ధమవుతున్నాడు. ఇదిలావుంటే తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ AK64కి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ కుమార్ తన 64 ప్రాజెక్ట్‌ను తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ ఇప్పటికే అజిత్‌ను కలిసి స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- February 15, 2025
0
76
Less than a minute
Tags:
You can share this post!
editor

