సందీప్‌కిషన్, రీతూవర్మ జంటగా నటించిన సినిమా ‘మజాకా’. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. శుక్రవారం ‘సొమ్మసిల్లి పోతున్నవే.. ఓ సిన్నా రాములమ్మ’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. జానపద శైలిలో సాగిన ఈ గీతానికి లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చారు. రేవంత్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. విజువల్స్‌తో పాటు మోయిన్ మాస్టర్ అందించిన నృత్యరీతులు పాటలో హైలైట్‌గా నిలిచాయి. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే చిత్రమిదని, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే అన్ని అంశాలుంటాయని నిర్మాతలు తెలిపారు.

- February 22, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor