హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాని అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు. ఇక నానితో అతను చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రానున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ఓవర్సీస్ రైట్స్‌ను భారీ ఒప్పందం ద్వారా దక్కించుకుంది. నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సినిమా నుండి ఎలాంటి మేజర్ అప్‌డేట్ రాకముందే, నాని సినిమా ఓవర్సీస్ రైట్స్‌తో దుమ్ములేపింది. ఇక నానికి ఓవర్సీస్‌లో సాలిడ్ ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ కారణంతోనే ‘ది ప్యారడైజ్’ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు కొనుగోలు చేశారట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.

- February 7, 2025
0
19
Less than a minute
Tags:
You can share this post!
editor