ఏపీ డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్‌కి దక్కడంతో తమ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఈ పదవి దక్కించుకున్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎవరికి ఏ సాయం కావల్సి వచ్చినా కూడా తాను ఉన్నాననే భరోసా ఇస్తున్నాడు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ని ఒక్కసారైన కలవాలని, వీలుంటే అతనితో కలిసి సెల్ఫీ దిగాలని ఎంతోమంది అభిమానులు కలలు కంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. పవన్ బర్త్ డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ పవన్ కళ్యాణ్ అభిమాని రక్తంతో తన అభిమాన నటుడి బొమ్మ గీయడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్ రక్తంతో పవన్ కళ్యాణ్ బొమ్మ అచ్చు అతనిలాగే ఉన్నట్టు కాగితంపై వేశాడు.

- April 5, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor