‘ఫౌజీ’లో హీరోగా ప్రభాస్, బ్రిటిష్ యువ‌రాణిగా హీరోయిన్ అలియాభట్.!

‘ఫౌజీ’లో హీరోగా ప్రభాస్, బ్రిటిష్ యువ‌రాణిగా హీరోయిన్ అలియాభట్.!

బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ బంపరాఫ‌ర్ కొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ మ‌ళ్లీ తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. హీరో ప్ర‌భాస్‌, హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ విష‌యం తెలిసిందే. ఫౌజీ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్ ఎస్మాయిల్ న‌టిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఈ సినిమా టైటిల్ ‘ఫౌజీ’ పేరు అయితే బావుంటుందని సినీ బృందం భావిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రానుండ‌గా బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారట. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు బాణీలు సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో కీల‌క‌మైన బ్రిటిష్‌ యువ‌రాణి పాత్ర‌లో బాలీవుడ్ న‌టి అలియా భ‌ట్ న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. యువ‌రాణి పాత్ర ఈ సినిమాలో కీల‌కం కావ‌డంతో.. అలియా భ‌ట్‌ని తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మ‌రోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు అనుపమ్ ఖేర్ న‌టిస్తున్నాడు.

editor

Related Articles