ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికను బయటపెట్టేసింది సాయిపల్లవి. ఆమెకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందట. దానికి బలమైన కారణం కూడా ఉందట. ‘పెళ్లప్పుడు కట్టుకోమని మా మామ్మ నాకు ఓ చీర ఇచ్చింది. అప్పుడు నాకు 21 ఏళ్లు. అప్పటికింకా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అసలు ఆ ఆలోచనే లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు కట్టుకుందామని ఆ చీర దాచుకున్నాను. కొనేళ్లకు అనుకోకుండా ‘ప్రేమమ్’తో నటిని అయ్యాను. ‘ఫిదా’తో మంచి పేరొచ్చింది. ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు కూడా అందుకుంటాననే నమ్మకం కలుగుతోంది. అందుకే.. జాతీయ అవార్డు అనేది నిజంగా నాకొస్తే.. అప్పుడు మా మామ్మ ఇచ్చిన చీర కట్టుకొని ఆ అవార్డు అందుకోవాలి అని నిశ్చయించుకున్నా.
- February 17, 2025
0
255
Less than a minute
Tags:
You can share this post!
administrator

