Movie Muzz

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా ‘తెలుసు కదా’

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా ‘తెలుసు కదా’

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తెలుసు కదా’. స్టైలిష్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతోంది. టీజీ విశ్వప్రసాద్‌, టీజీ కృతిప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి హీరోయిన్లు. శుక్రవారం వాలెంటైన్స్‌ డే సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘న్యూ జనరేషన్ లవ్‌స్టోరీ ఇది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కించాం. లవర్‌బాయ్‌గా సిద్ధు జొన్నలగడ్డ పాత్ర గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: జ్ఞానశేఖర్‌ బాబా, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, సంగీతం: తమన్‌.

editor

Related Articles