బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు చేరువయ్యింది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన ఈ ప్యూర్ మాస్ యాక్షన్ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ఇక మిగతా సంక్రాంతి సినిమాలకు ధీటుగా ఈ సినిమా రిజల్ట్ వస్తుండడంతో సినిమా యూనిట్ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ‘డాకు మహారాజ్’ సినిమా విజయోత్సవ సభలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌పై బాలకృష్ణ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. థమన్ ప్రతిసారి తన సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. అందుకే అతడిని అందరూ నందమూరి థమన్ అంటారని బాలయ్య పొగిడారు. అయితే, ఇకపై అలా అనొద్దని.. NBK థమన్ అని పిలవాలని బాలయ్య కోరారు. ఇలా బాలయ్య సినిమాలకు అదిరిపోయే స్కోర్ అందిస్తున్న థమన్‌పై బాలయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
- January 18, 2025
0
87
Less than a minute
Tags:
You can share this post!
editor
Related Articles
prev
next


