హీరో శర్వానంద్ యాక్ట్ చేస్తున్న తాజా సినిమాకి ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అనిల్, రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. శర్వానంద్ నటిస్తున్న 37వ సినిమా ఇది. సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను బాలకృష్ణ, రామ్‌చరణ్ విడుదల చేశారు. ‘ముక్కోణపు ప్రేమకథా సినిమా ఇది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. శర్వానంద్ పాత్ర గత సినిమాలకు భిన్నంగా ఉంటుంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నాం’ అని మేకర్స్ తెలిపారు. సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి కథ: భాను భోగవరపు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
- January 16, 2025
0
141
Less than a minute
Tags:
You can share this post!
editor

