‘కల్కి 2898ఏడీ’ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానున్నదనీ.. దీపికా పదుకొణె షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్‌గా ఈ వార్తపై స్పందించింది దీపికా పదుకొణె. కల్కి షూటింగ్ త్వరలో మొదలుకానున్నదని వినిపిస్తున్న వార్తలో నిజంలేదు. నావరకూ ఎలాంటి సమాచారం లేదు కూడా. అయినా ప్రస్తుతం నా ఆలోచనలన్నీ నా కుమార్తె ‘దువా’ పైనే ఉన్నాయి. తనను దగ్గరుండి చూసుకోవాలి. మా అమ్మ నన్ను ఎలా పెంచిందో.. అదే విధంగా నా కూతుర్ని నేను పెంచాలి. తన ప్రతి కోరికను, అవసరాన్ని నేను తీర్చాలి అంటూ చెప్పుకొచ్చింది దీపిక. ఇదిలావుంటే.. కల్కి పార్ట్ 2 ప్రోగ్రెస్ గురించి ఇటీవలే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తొలిపార్ట్‌తో పాటే సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా 35 శాతం పూర్తయింది. ఇందులో కూడా దీపికా పదుకొణె కొన్ని సన్నివేశాల్లో అమ్మగా కనిపిస్తారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి ప్రారంభించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
 
											- December 31, 2024
				
										 0
															 102  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				

 
											 
											