ఒకవైపు ఫ్యామిలీ గొడవలతో సతమవుతున్న మంచు ఫ్యామిలీ.. మరోవైపు తమ కలల ప్రాజెక్ట్ కన్నప్పను పూర్తిచేసే పనిలోపడింది. మంచు కుటుంబం నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రీతి కన్నప్ప ఇష్టసఖి, చెంచుల యువరాణి నెమలి పాత్రలో నటిస్తోంది. అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్వం.. కన్నప్పకి సర్వస్వం చెంచుల యువరాణి నెమలి అంటూ ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది. హిస్టారికల్ కం మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్‌లను పంచుకున్న చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.

- December 30, 2024
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor