పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై తొలిసారి స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడుతూ.. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్లైంది. ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ సంతాపం తెలపకున్న.. చిత్రబృందం అయినా కనీసం సంతాపం తెలపాల్సింది. సీఎం రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడంతో అతడిని అరెస్ట్ చేశారు అనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
- December 30, 2024
0
190
Less than a minute
Tags:
You can share this post!
administrator

