‘అలియాభట్ ఓ మాయ.. ఆమె ఒక ప్రపంచం, ఒక్కసారి ఆమెతో పనిచేస్తే ఆ మాయలో ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె ఆరా మనల్ని కూడా కమ్మేస్తుంది.’ అంటున్నారు దర్శకుడు వాసన్‌బాల. ఇటీవలే అలియాతో ఆయన ‘జిగ్రా’ సినిమా తెరకెక్కించారు. ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా.. అలియాతో పనిచేశానన్న తృప్తి మాత్రం ‘జిగ్రా’ వల్ల లభించిందని ఆయన అన్నారు. ‘జిగ్రా’ సీరియస్ సబ్జెక్ట్. ఆ కథలో కామెడీ లేదు. కానీ సెట్ అంతా ఎప్పుడూ కామెడీగా నవ్వుతూ ఉండేది. కారణం అలియాభట్. తను నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఓ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సష్టించడం అలియా స్పెషాలిటీ. ఆమెతో ఒక్కసారి పనిచేశాక.. మళ్లీ ఇంకొకరితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే తనే గుర్తుకొస్తుంటుంది..’ అంటూ మాట్లాడారు వాసన్‌బాలా. దీన్నిబట్టి అలియా మాయ ఏ రేంజ్‌లో ఉంటుందో మీరే అర్థం చేసుకోండి.
 
											- December 30, 2024
				
										 0
															 91  
															  Less than a minute 
										
				
			
				Tags:			
		You can share this post!
editor
				

 
											 
											