భారతీయ సినీ నటుడు, హీరో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన కళారంగానికి చేసిన సేవల గురించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్‌లో భాగంగా.. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. మన్ కీ బాత్ 117వ ఎసిపోడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. అక్కినేని తన కృషితో తెలుగు సినిమాను శిఖరాగ్రాన నిలబెట్టారని ఆయన కొనియాడారు. భారతీయ సంస్కృతి, వారసత్వ విలువలు ఆయన సినిమాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని మోడీ మన్ కీ బాత్‌లో గుర్తుచేసుకున్నారు. ఎఎన్ఆర్‌పై మోడీజీ మాట్లాడటంతో తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. మోడీ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, శోభితా దుళిపాళ దంపతులు స్పందించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. మీ నుండి ప్రశంసలు పొందడం మా అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నాగ చైతన్య, శోభిత రాసుకొచ్చారు.

- December 30, 2024
0
11
Less than a minute
Tags:
You can share this post!
editor