ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపైనే కాకుండా సామాజిక అంశాలపై ఎప్పుటికప్పుడు క్వశ్చన్ చేసే నటీమణుల్లో టాప్‌లో పూనమ్ కౌర్ ఉంటుంది. సోషల్ మీడియాలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక కామెంట్‌తో వార్తల్లో తనదైన ముద్ర వేస్తుంది. మహిళలెవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమేం కాదంటోంది పూపమ్ కౌర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసింది. సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా కనబడుటలేదు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు.. అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది పూనమ్ కౌర్. ఈ కామెంట్స్ సినీ ప్రముఖులతో భేటీని ఉద్దేశించి చేసినవేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్‌పై ఎవరెలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
- December 27, 2024
0
240
Less than a minute
Tags:
You can share this post!
administrator

