ఓటీటీలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ బిహైండ్‌ అండ్‌ బియాండ్

ఓటీటీలోకి ఆర్‌ఆర్‌ఆర్‌ బిహైండ్‌ అండ్‌ బియాండ్

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేసిందో మీకు తెలిసిందే. ఈ మాగ్నమ్‌ ఓపెస్‌పై జక్కన్న టీం డాక్యుమెంటరీ ఆర్‌ఆర్‌ఆర్‌ బిహైండ్‌ అండ్‌ బియాండ్  రూపొందించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లీడ్ రోల్స్‌లో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ ఫిమేల్ లీడ్‌ రోల్‌ పోషించింది. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియా కీలక పాత్రల్లో నటించారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఈ డాక్యుమెంటరీ ఇండియావైడ్‌గా డిసెంబర్ 20న ఎంపిక చేయబడ్డ థియేటర్లలో విడుదలైంది. గంట 37 నిమిషాల రన్‌టైంతో సాగే ఈ డాక్యుమెంటరీలో రూపొందించిన బిహైండ్‌ ది సీన్స్‌ కంటెంట్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమా లవర్స్‌. కాగా ఇక పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మంచి స్పందన రాబట్టుకుంటున్న ఈ సినిమా మరి నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సినిమా కోసం తారక్‌, రాంచరణ్‌, జక్కన్న అండ్ టీం ఎంతలా కష్టపడిందో తెలియాలంటే డాక్యుమెంటరీ చూడాల్సిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ నుంచి 2021లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌ బ్లాక్ బస్టర్‌గా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడటమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

editor

Related Articles