అజయ్‌ దేవ్‌గణ్‌ సింగం ఎగైన్‌ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!

అజయ్‌ దేవ్‌గణ్‌ సింగం ఎగైన్‌ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!

రోహిత్‌ శెట్టి పాపులర్ కాప్‌ యూనివర్స్‌ సింగం ప్రాంఛైజీకి క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో వచ్చిన సినిమా సింగం ఎగైన్‌. బాలీవుడ్‌ యాక్టర్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ టైటిల్‌ రోల్‌ పోషించాడు. అక్షయ్‌ కుమార్, రణ్‌వీర్‌ సింగ్‌, అర్జున్‌ కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, కరీనాకపూర్‌, దీపికాపదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది.

ఈ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ డ్రామా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి డిసెంబర్ 13న ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటివరకు రూ.499 ధరతో రెంటల్‌ ఫీ విధానంలో చూసే అవకాశం మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాను ఉచితంగా చూడాలని ఎదురుచూసే వాళ్లకు గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. సింగం ఎగైన్‌ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు. ఇప్పటిదాకా కొందరికి మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇక అందరు సబ్‌స్క్రైబర్లు ఉచితంగా చూడొచ్చన్నమాట. ప్రస్తుతం హిందీ వెర్షన్ ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, జియో స్టూడియోస్‌, రోహిత్ శెట్టి పిక్చర్స్‌, దేవ్‌గణ్‌ ఫిలిమ్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి.

editor

Related Articles