ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయాలై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఇవాళ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి పరామర్శించారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. కుటుంబసభ్యులు, డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ఇండస్ట్రీ నుండి సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్ కోరాం. ఇవాళ ఉదయమే అపాయింట్‌మెంట్ ఇస్తానన్నారు. నటులు, నిర్మాతలు, డైరెక్టర్లతో గురువారం ఉదయం 10 గంటలకు సీఎంను కలుస్తామన్నారు. ఎఫ్‌డీసీ తరపున ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండాలని సీఎం అడిగారు. ఈ నేపథ్యంలో పోలీస్ టవర్స్‌లో సీఎంతో సమావేశమవుతామని దిల్ రాజు తెలిపారు.
- December 25, 2024
0
175
Less than a minute
Tags:
You can share this post!
administrator

