క్రిస్మస్ కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ బాలకృష్ణ డాకు మహారాజ్‌ విడుదల..

క్రిస్మస్ కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ బాలకృష్ణ డాకు మహారాజ్‌ విడుదల..

నందమూరి బాలకృష్ణ  టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం డాకు మహారాజ్‌. ఎన్‌బీకే 109గా తెరకెక్కుతున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా మేకర్స్ క్రిస్మస్ కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు. క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని లీడ్ క్యారెక్టర్లను పరిచయం చేశాడు. బాలకృష్ణ ఓ వైపు గండ్రగొడ్డలి చేతబట్టి కనిపిస్తుండగా.. మరోవైపు ఊర్వశి రౌటేలా పిస్తోల్‌ పట్టుకుంది. బాబీడియోల్‌, ప్రగ్యాజైశ్వాల్, శ్రద్దాశ్రీనాథ్‌ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశాడు. తాజా లుక్‌ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ డ్యాన్సింగ్ క్వీన్‌ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫిమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. బాబీ డియోల్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్‌, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

editor

Related Articles